నితిన్ కి త్రివిక్రమ్ అందించిన కథపైనే అందరి దృష్టి!
- నితిన్ .. మేఘా ఆకాశ్ జంటగా సినిమా
- కథను అందించిన త్రివిక్రమ్
- ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు
'అజ్ఞాతవాసి' కథ విషయంలో త్రివిక్రమ్ సరిగ్గా దృష్టిపెట్టలేదనే విమర్శలు వచ్చాయి. ఈ కారణంగా నితిన్ సినిమాకి ఆయన అందించిన కథా నేపథ్యం గురించే అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి త్రివిక్రమ్ అందించిన కథ రొమాంటిక్ డ్రామాగా కొనసాగుతుందనేది తాజా సమాచారం. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఈ కథ ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 12 న టైటిల్ ను ఖరారు చేసి .. 14న టీజర్ ను రిలీజ్ చేసి .. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.