పీవీ సింధుకు దీపికా పదుకొనే విసిరిన చాలెంజ్ ఇది!
Add ap7am to your home Screen

పీవీ సింధుకు దీపికా పదుకొనే విసిరిన చాలెంజ్ ఇది!

  • 'ప్యాడ్ మ్యాన్' చాలెంజ్ స్వీకరించు
  • చేత్తో శానిటరీ ప్యాడ్ తో దీపిక సెల్ఫీ
  • అక్షయ్ కుమార్ ప్రారంభించిన ప్రచారం
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు, బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనే ఓ చాలెంజ్ విసిరింది. అదేంటో తెలుసా? 'ప్యాడ్ మ్యాన్' చాలెంజ్ ని స్వీకరించాలని. ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ తెలుసుగానీ, ఈ ప్యాడ్ మ్యాన్ చాలెంజ్ ఏంటని అనుకుంటున్నారా? చేతిలో ఓ శానిటరీ ప్యాడ్ పట్టుకుని సెల్ఫీ దిగి, దాన్ని పోస్టు చేయడమే. తన తాజా చిత్రం 'ప్యాడ్ మ్యాన్' ప్రమోషన్ లో భాగంగా అక్షయ్ కుమార్ ఈ చాలెంజ్ చేయగా, దీపిక దాన్ని స్వీకరించింది.

ఆపై ఆమె ఓ చేత్తో శానిటరీ ప్యాడ్ పట్టుకుని పీవీ సింధుకు ఆ సవాల్ ను ఫార్వర్డ్ చేసింది. ఇక, ఎంతో మంది సామాన్యుల నుంచి, సెలబ్రిటీల వరకూ చేత్తో ప్యాడ్ పట్టుకుని సెల్ఫీలు దిగుతూ, ఇదేమీ సిగ్గు పడాల్సిన విషయం కాదని, శారీరక పరిశుభ్రతపై అవగాహన కోసమేనని చెబుతూ, వాటిని పోస్టు చేస్తున్నారు. తన గ్రామంలో తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ నేపికిన్ లను తయారు చేసి, వాటిని మహిళలకు అందించి ఆదర్శవంతంగా నిలిచిన అరుణాచలమ్ మురుగనాథన్ అనే వ్యక్తి జీవితకథ ఆధారంగా అక్షయ్ ఈ చిత్రం తీసిన సంగతి తెలిసిందే.
Padman
Akshay Kumar
Deepika Padukone
PV Sindhu

More Telugu News