అది వెకిలి నవ్వో, ప్రేమ నవ్వో తెలియదు!: పేర్లు వెల్లడించకుండా మోహన్ బాబు విమర్శలు!
- 'గాయత్రి' ప్రమోషన్ లో బిజీగా ఉన్న మోహన్ బాబు
- నాకు ఒకరిద్దరు మాత్రమే స్నేహితులు
- సినీ ఇండస్ట్రీలో నిజమైన స్నేహితులు లేరు
- చాలా మందిలో ఈగో: మోహన్ బాబు
ఇటీవలి కాలంలో కొందరితో సన్నిహితంగా ఉండాలని చూసి విఫలమయ్యానని చెప్పారు. చాలా మందిలో ఉన్న ఈగో చూసి ఆశ్చర్యపోయానని, వారి పేర్లు మాత్రం చెప్పబోనన్నారు. 'తాను ఏదైనా పని ఉండి ఎవరికైనా ఫోన్ చేస్తే, ఆ సమయంలో అందుబాటులో లేకపోయినవారు, ఎందుకు చేశానో అని ఆలోచించి కనీసం ఆ తర్వాతైనా చేయరు' అన్నారు. వంద సంపాదించి, రెండొందలు సంపాదించినట్టు డబ్బాలు కొట్టుకుంటూ ప్రజలను కొందరు మోసం చేస్తున్నారని, పబ్లిసిటీ కోసం లేనిపోనివి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సినిమా ఆడకుంటే లోపం ఉన్నట్టేనని తెలిపారు.