అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కేంద్ర మంత్రి ఉమాభారతి

తీవ్ర హైపర్ టెన్షన్‌‌తో బాధపడుతున్న కేంద్రమంత్రి ఉమాభారతి ‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమెకు ప్రైవేటు వార్డులో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మంత్రి ఉమాభారతి 2016, 17లో కూడా చాతీ నొప్పి, హైపర్ టెన్షన్, ఇతర సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. మరోవైపు, ఆమె మోకాలి నొప్పితో బాధపడుతున్నారని,  నొప్పి భరించలేని స్థాయికి చేరడంతో మంత్రిని ఆసుపత్రిలో చేర్చినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Go Back to Shorts
Uma Bharti
Health
AIIMS
New Delhi

More Telugu News