bhadrachalam: భద్రాచలం ఆలయ తుది నమూనాలు పరిశీలించిన మంత్రి తుమ్మల

షార్ట్స్‌లో చూడండి
భద్రాచలం ఆలయ అభివృద్ధి నమూనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు శ్రీ సీతారామస్వామి వారి ఆలయ అభివృద్ధి పథకంలో భాగంగా ఆర్కిటెక్ట్ ఆనంద సాయి సారథ్యంలో ఈ మూడు నమూనాలను తయారు చేయించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి ఆశీస్సులతో ఈ మూడు నమూనాలు కుదిరాయని, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి, కేసీఆర్ సమక్షంలో తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వచ్చే శ్రీరామనవమి నాటికి ఆలయ అభివృద్ధికి తుదిరూపు కల్పిస్తామని చెప్పారు. 
Go Back to Shorts
bhadrachalam
Telangana
tummala

More Telugu News