నేటితో ముగియనున్న మేడారం జాతర
- చివరి రోజు కావడంతో పోటెత్తిన భక్తులు
- అమ్మవార్లు వన ప్రవేశంతో ముగియనున్న జాతర
- వీఐపీల తాకిడితో దర్శనం ఆలస్యమవుతోందంటూ భక్తుల విమర్శలు
ఈ జాతరకు వీఐపీల తాకిడి కారణంగా తమకు దర్శనం ఆలస్యమవుతోందని భక్తులు విమర్శిస్తున్నారు. కేవలం వీఐపీల తాకిడే కాకుండా, అధికారుల సమన్వయం లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోందని పలువురు భక్తులు ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన కుటుంబంతో నిన్న మేడారం సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు వనదేవతలను నిన్న సందర్శించుకున్నారు.