పొమ్మనలేక పొగ పెడుతున్నారు.. కేంద్ర బడ్జెట్‌పై జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం
- కేంద్ర ప్రభుత్వం నామ మాత్రంగానే సాయం చేస్తోంది
- వేల, లక్షల కోట్లు సాయం చేస్తేనే ఏపీకి నిజంగా సాయం చేసినట్లు
- ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు
- అతి తక్కువగా నిధులు ఇచ్చి సాయం చేశామంటే ఎలా?
పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. టీడీపీకి మాత్రమే కాదని, దేశంలోని అన్ని పార్టీలకు ఈ బడ్జెట్‌పై నిరాశ, నిస్పృహలు ఉన్నాయని చెప్పారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని, అతి తక్కువగా నిధులు ఇచ్చి సాయం చేశామంటే ఎలా? అని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి చాలా సహనం ఉందని, ఆయన ఎంతో ఓపికగా ఉన్నారని వ్యాఖ్యానించారు.