Uttam Kumar Reddy: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కౌంటర్ ఇచ్చి.. ఎద్దేవా చేసిన మంత్రి కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే, సదస్సుకు వెళ్లే వారు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగానే మంత్రి కేటీఆర్ కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఆ స‌ద‌స్సుకు వెళ్లారని, అంతేకానీ, ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందలేద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఈ రోజు ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్‌, ఈమెయిల్‌ కాపీలు ఇవేనంటూ ప‌లు ఫొటోల‌ను కేటీఆర్ పోస్ట్ చేశారు.

మేధో దివాళాకోరుతనానికి ప్రతీక అయిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఆయన కోసం ఈ ఆహ్వానం కాపీలను వెల్లడిస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే, ‘ఉత్తమ్‌గారూ నేను ‘పప్పూ’ను కాదు.. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు హుందాగా స‌రి చేసుకుంటారని ఆశిస్తున్నాన‌ని ఎద్దేవా చేశారు. 
Go Back to Shorts
Uttam Kumar Reddy
KTR
Congress
TRS

More Telugu News