shriya: పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను: శ్రియ

షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న శ్రియ, ఆ తరువాత నుంచి తన వయసుకు తగిన కీలకమైన పాత్రలను పోషిస్తూ బిజీగా వున్నారు. అలా తాజాగా ఆమె 'గాయత్రి' సినిమా చేశారు. మోహన్ బాబు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, వచ్చేనెల 9వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. చాలా నిజాయతీతో కూడిన తెలివైన అమ్మాయిగా నా పాత్ర ఉంటుంది. దర్శకుడు మదన్ ఈ పాత్రను అత్యంత సహజంగా .. అద్భుతంగా మలిచాడు. అందువల్లనే ఎంతమాత్రం ఆలోచన చేయకుండా ఈ సినిమాను చేయడానికి అంగీకరించాను. ఈ పాత్ర నాకు మరింత మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం వుంది. తెలుగులో 'వీరభోగ వసంతరాయలు' .. తమిళంలో 'నరగసూరన్' చేస్తున్నాను." అంటూ చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
shriya
mohan babu

More Telugu News