కొత్త లుక్ తో విజయ్ అదరగొట్టేస్తాడట!
- 62వ సినిమా పనుల్లో బిజీగా విజయ్
- కథానాయికగా కీర్తి సురేశ్
- బలమైన సందేశంతో కూడిన కథ
కొంత కాలంగా సినిమా .. సినిమాకి తాను కొత్తగా కనిపించడానికి విజయ్ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. మాస్ .. క్లాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలతో పాటు, స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'భైరవ' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ విజయ్ రాజకీయాలను టచ్ చేస్తారా .. లేదా? అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.