'సైరా' గెటప్ లో ఆకట్టుకుంటోన్న సురేందర్ రెడ్డి తనయుడు
- 'సైరా' తొలి షెడ్యూల్ పూర్తి
- ఈ సినిమాలో చిరూ వేషధారణ ప్రత్యేకం
- అలాంటి డ్రెస్ కావాలన్న సురేందర్ రెడ్డి తనయుడు
'సైరా' గెటప్ లో ఆకట్టుకుంటోన్న ఈ సిసింద్రీ ఎవరో కాదు .. ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి తనయుడు. 'సైరా' షూటింగ్ సమయంలో చిరూ గెటప్ చూసిన ఈ కుర్రాడు .. తనకి కూడా అలాంటి డ్రెస్ కావాలని మారాం చేశాడట. దాంతో తనయుడి ముచ్చట తీర్చడం కోసం సురేందర్ రెడ్డి అలాంటి కాస్ట్యూమ్స్ ను సిద్ధం చేయించాడట. ఆ డ్రెస్ వేసుకుని ఈ బుడతడు ఇచ్చిన స్టిల్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.