Pawan Kalyan: రైతులు తమ సమస్యలు వివరిస్తుండగా ఈలలు వేసిన ఫ్యాన్స్.. వేయొద్దని చెప్పిన పవన్ కల్యాణ్
ప్రజల మేలుకోరే వ్యక్తిగా తాను వచ్చానని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు అనంతపురంలో పర్యటిస్తోన్న పవన్ కల్యాణ్ అక్కడ రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే, వేదికపై రైతులు సమస్యలు వివరిస్తుండగా అదే సమయంలో అభిమానులు ఈలలు వేయడంతో అలా చేయకూడదని పవన్ కల్యాణ్ చెప్పారు. సమస్యలపై చర్చిస్తున్నప్పుడు అటువంటి పనులు చేయకూడదని అన్నారు.
కాగా, కరవు నివారణ చర్యలపై, పంటసాగుకు తీసుకోవాల్సిన చర్యలపై మేధావులు, వ్యవసాయ నీటి పారుదల రంగ నిపుణులతో చర్చించానని వారు ఇచ్చిన సూచనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఏదో ఒక్కరోజు అనంతపురానికి వచ్చి వెళ్లిపోవడం కాదని, శాశ్వత పరిష్కారాన్ని చూపే దిశగా వెళదామని ఇక్కడకు వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు.