'మహానటి' ఆ రోజునే పక్కాగా వస్తుందట!
- కీర్తి సురేశ్ ప్రధాన పాత్రగా 'మహానటి'
- విడుదల తేదీ వాయిదా పడిందనడంలో వాస్తవం లేదు
- మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఇక 'మహానటి' సినిమాను కూడా మార్చి 30వ తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి పనులు ఈ లోగా పూర్తి కాకపోవచ్చనీ, అందువలన ఆ తేదీన రిలీజ్ చేయడం కష్టమేననే టాక్ వచ్చింది. కానీ ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని ఈ సినిమా టీమ్ చెబుతోంది. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పులు లేవనీ, ముందుగా చెప్పినట్టుగానే మార్చి 30వ తేదీనే వస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికి 'మహానటి' గట్టిపోటీకే రెడీ అవుతోందన్న మాట.