సురేందర్ రెడ్డి చేతుల మీదుగా 'బంగారి - బాలరాజు' టీజర్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సురేందర్ రెడ్డి చేతుల మీదుగా 'బంగారి - బాలరాజు' టీజర్ రిలీజ్

  • ప్రేమ కథాంశం నేపథ్యంలో 'బంగారి బాలరాజు'
  • వచ్చేనెల 14న ట్రైలర్ రిలీజ్ 
  • మార్చిలో సినిమా విడుదల
రాఘవ్ .. కరణ్య కత్రీన్ నాయకా నాయికలుగా 'బంగారి - బాలరాజు' సినిమా రూపొందుతోంది. రఫీ - రాఘవేంద్ర రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

టీజర్ ను రిలీజ్ చేసిన సురేందర్ రెడ్డి చెబుతూ, టీజర్ చాలా బాగుందంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందంటూ, టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ, 'సైరా' సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ .. సురేందర్ రెడ్డి తమ ఆహ్వానాన్ని మన్నించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఫిబ్రవరి 14వ తేదీన థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసి, మార్చిలో సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. 
surendar reddy

More Telugu News