Visakhapatnam District: విడాకులిచ్చిందన్న అక్కసుతో భార్యను కారుతో ఢీ కొట్టిన భర్త

షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్టణంలో శాడిస్టు భర్త నిర్వాకం అగనంపూడిలో కలకలం రేపింది. విభేదాల కారణంగా భర్త నుంచి విడాకులు పొందిన మహిళ అగనంపూడిలోని తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. తనను కాదన్న భార్య అంతుచూడాలని భావించిన ఆ భర్త... ప్రణాళిక ప్రకారం, ఆమె మరోవ్యక్తితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వారిని కారుతో ఢీ కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్ధానికులు బాధితుడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. 
Go Back to Shorts
Visakhapatnam District
aganampudi

More Telugu News