భారత్-పాక్ సరిహద్దులో రకుల్ ప్రీత్ సింగ్.. జవాన్లతో కలిసి గణతంత్ర వేడుకలు

షార్ట్స్‌లో చూడండి
గణతంత్ర దినోత్సవ వేళ టాలీవుడ్ ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ వాఘా సరిహద్దులో సందడి చేసింది. జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొంది. ‘అయ్యారీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శక నిర్మాత నీరజ్ పాండే, నటులు మనోజ్ బాజ్‌పేయి, సిద్ధార్థ మల్హోత్రా, రకుల్‌ప్రీత్ సింగ్, పూజా చోప్రా తదితరులు శుక్రవారం అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సరిహద్దులో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. జవాన్లతో కలిసి సెల్ఫీలు దిగారు. బీఎస్‌ఎఫ్ అధికారులతో కలిసి ఓ ఇంటరాక్టివ్ సెషన్‌ను కూడా నిర్వహించారు. కాగా, గతంలోనూ చిత్ర యూనిట్ జైసల్మేర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంపును సందర్శించింది.

రకుల్ ప్రీత్ నటించిన ‘అయ్యారీ’ సినిమా ఈనెల 26నే విడుదల కావాల్సి ఉండగా ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. కాగా, రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ షార్ట్ ఫిల్మ్‌ను పోస్టు చేస్తూ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరింది. తమలో స్ఫూర్తి నింపుతున్న జాతీయ జెండాకు సలాం చేయాలని కోరింది. మనోజ్ బాజ్‌పేయి కూడా తన ట్విట్టర్ ఖాతాలో బీఎస్ఎఫ్ జవాన్లను కలిసి ఫొటోలను పోస్టు చేశాడు.
Go Back to Shorts
Rakul preet singh
Tollywood
Bollywood
Republic Day
Sidharth Malhotra

More Telugu News