పేటీఎం రిపబ్లిక్ డే ఆఫర్లు... స్మార్ట్ ఫోన్లపై రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్

  • ల్యాప్ టాప్, కెమెరాలపైనా
  • ఈ నెల 28 వరకు అమల్లో
  • శామ్ సంగ్, వివో, ఐఫోన్లపై తగ్గింపులు
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేకమైన డీల్స్, ఆఫర్లను పేటీఎం మాల్ అందిస్తోంది. ఈ ప్రత్యేక విక్రయాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 28 వరకు ఆఫర్లు అమల్లో ఉంటాయి. స్మార్ట్ ఫోన్లపై 10,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ల్యాప్ టాప్ లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ పై రూ.20,000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, వివో వీ7ప్లస్, ఐపాడ్స్, ఈ బుక్ రీడర్లపై ఆఫర్లు ఉన్నాయి.

ఐఫోన్ ఎక్స్ 64జీబీ వెర్షన్ పై క్యాష్ బ్యాక్ పోను వాస్తవ ధర రూ.83,899గా ఉంది. ఐఫోన్ ఎక్స్ 256 జీబీ రూ.98,000కే లభిస్తుంది. దీని వాస్తవ విక్రయ ధర రూ.1,02,000. ఇంకా ఐఫోన్ 8 64జీబీ వెర్షన్ ధర రూ.52,706. ఐఫోన్ 8ప్లస్ 64జీబీ ధర రూ.63,470. స్మార్ట్ ఫోన్లపై క్యాష్ బ్యాక్ కోసం కొనుగోలు సమయంలో ప్రోమో కోడ్ లను అప్లయ్ చేయాల్సి ఉంటుంది. వివో వీ5ఎస్ 64జీబీ, వివో వై555, వివో వై69, మోటో ఈ4 ప్లస్ 32జీబీ, లెనోవో కేనోట్ 32జీబీ, లెనోవో కే6 పవర్ 32జీబీలపైనా ఆఫర్లున్నాయి.

లెనోవో కే8 32జీబీ ఫోన్ ధర రూ.8,170గా ఉంది. ప్రోమో కోడ్ MOB12 ను అప్లయ్ చేయడం ద్వారా దీనిపై రూ1,114 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. వివో వీ7ప్లస్ 64జీబీ, ఎంఆర్పీ రూ.22,990 కాగా, దీనిపై రూ.2,199 క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. మోటరోలా మోటో జెడ్ ప్లే32జీబీ రూ.17,327 కే లభిస్తోంది. శామ్ సంగ్ జే3 ప్రో, శామ్ సంగ్ గెలాక్సీ జే2 మోడళ్లపైనా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి.
Go Back to Shorts
paytm mall
republic day sale

More Telugu News