Subbi Ram reddy: మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక

షార్ట్స్‌లో చూడండి
మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరికలు జారీ చేసింది. కాకతీయ కళా వైభవం పేరుతో సినీ నటులను సన్మానిస్తే సహించేది లేదని పేర్కొంది. అయితే ఈ పేరుతో స్థానిక కళలు, కళాకారుల  పురోగతికి తోడ్పడితే మాత్రం స్వాగతిస్తామని పేర్కొంది.

కాకతీయ హెరిటేజ్ వ్యవస్థాపక సభ్యుడు పాపారావు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా సంస్కృతిని బుద్ధిస్ట్ హెరిటేజ్‌కు ముడిపెట్టే ప్రయత్నం మానుకోవాలన్న ఆయన సినీ పరిశ్రమ వల్ల తెలంగాణ సంస్కృతికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. శిల్పకళా వేదికలో రెండు రోజుల క్రితం సినీ నటుడు మోహన్‌బాబును సుబ్బరామిరెడ్డి సన్మానించి బిరుదు ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలోనే కాకతీయ హెరిటేజ్ ఈ హెచ్చరికలు జారీ చేసింది.
Go Back to Shorts
Subbi Ram reddy
Tollywood
Mohan Babu

More Telugu News