95 శాతం మంది రాజకీయనాయకులు రాస్కెల్స్: మోహన్ బాబు ఆగ్రహం
- ప్రజలకు రాజకీయ నాయకులు ఎన్నో హామీలిస్తున్నారు
- వారు మాట నిలబెట్టుకుంటే భారత్ ఇంకా మంచి స్థానంలో ఉండేది
- ఎన్టీఆర్ మాత్రం మంచి వ్యక్తి, నన్ను రాజ్యసభకు పంపారు
- 'ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018'లో మోహన్ బాబు
'ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018లో పాల్గొన్న మోహన్ బాబు మాట్లాడుతూ... తన స్నేహితుడు, తాను అన్న అని పిలుచుకునే ఎన్టీఆర్ మాత్రం మంచి వ్యక్తని అన్నారు. లంచం అంటే ఏమిటో కూడా ఆయనకు తెలియదని, ఆయన తనను రాజ్యసభకు పంపారని, తాను ఎలాంటి మచ్చ లేకుండా తన పదవీ కాలాన్ని పూర్తి చేశానని చెప్పుకొచ్చారు.