మురుగదాస్ తో సెట్స్ పైకి విజయ్
- విజయ్ 62వ సినిమాకి సన్నాహాలు
- ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్
- దీపావళికి ప్రేక్షకుల ముందుకు
ఈ రోజునే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, రెగ్యులర్ షూటింగ్ ను కూడా ఈ రోజు నుంచే మొదలుపెట్టేసింది. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించే ఈ సినిమాను దీపావళికి విడుదల చేస్తున్నట్టుగా మురుగదాస్ చెప్పాడు. గతంలో విజయ్ తో మురుగదాస్ చేసిన 'కత్తి' .. 'తుపాకి' సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు వున్నాయి.