chiranjeevi: గుణశేఖర్ ను చిరూ అడగలేదట!

షార్ట్స్‌లో చూడండి
'సైరా' సినిమా షూటింగ్ ఫస్టు షెడ్యూల్ పూర్తయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్టుగా కొనసాగింది. అయితే ఈ షెడ్యూల్ తరువాత .. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను గుణశేఖర్ కి అప్పగించాలనే నిర్ణయానికి చిరంజీవి వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. గుణశేఖర్ కి పౌరాణిక .. చారిత్రక చిత్రాల కథా కథనాలపైనే కాదు, భారీ సెట్స్ ను అద్భుతంగా డిజైన్ చేయించగలిగే సామర్థ్యం వుంది.

 అందువలన చిరంజీవి అలా ఆలోచన చేశారని చెప్పుకున్నారు. అయితే అందులో వాస్తవం లేదన్నది తాజా సమాచారం. ప్రస్తుతం గుణశేఖర్ .. 'హిరణ్యకశిప' సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను తప్పకుండా వస్తానని గుణశేఖర్ కి చిరూ మాట ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది.    
Go Back to Shorts
chiranjeevi
gunasekhar

More Telugu News