'జై సింహా' మూడు రోజుల వసూళ్లు!
Add ap7am to your home Screen

'జై సింహా' మూడు రోజుల వసూళ్లు!

  • మొదటి నుంచి బాలకృష్ణకి మాస్ ఇమేజ్
  • ఆయన సినిమాలో మాస్ అంశాలు పుష్కలం
  • అందుకే పెరుగుతోన్న వసూళ్లు
మొదటి నుంచి కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సాధ్యమైనంత వరకూ సంక్రాంతికి తన సినిమా బరిలో ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటారు. అలా ఈ సంక్రాంతికి ఆయన 'జై సింహా' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగు రాష్ట్రాల్లో  తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 11.75 కోట్ల షేర్ ను .. 17.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 13.9 కోట్ల షేర్ ను .. 22.9 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

ఈ సినిమాకంటే రెండు రోజులు ముందుగా వచ్చిన  'అజ్ఞాతవాసి' అభిమానులను నిరాశపరిచింది. 'జై సింహా'తో పాటే విడుదలైన 'గ్యాంగ్' కూడా ఆకట్టుకోలేకపోయింది. 'జై సింహా' తరువాత వచ్చిన 'రంగుల రాట్నం' కూడా ఆశించిన స్థాయిలో యూత్ ను అలరించలేకపోయింది. బాలకృష్ణ సినిమాలో మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలు పుష్కలంగా ఉండటంతో, ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతోందని చెప్పుకుంటున్నారు.
balakrishna
nayanatara

More Telugu News