పవన్ .. త్రివిక్రమ్ ల పారితోషికమే 50 కోట్లు?
- త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ కి క్రేజ్
- అదే కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి'
- ఇద్దరి పారితోషికాలపై ఫిల్మ్ నగర్ టాక్
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికీ భారీ మొత్తంలో పారితోషికాలు ముడుతున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. అంతకు ముందు సినిమాల సంగతి అటుంచితే, 'అజ్ఞాతవాసి' సినిమాకి గాను త్రివిక్రమ్ 20 కోట్లు పారితోషికం తీసుకోగా, పవన్ కి 30 కోట్ల పారితోషికం ముట్టిందని చెప్పుకుంటున్నారు. ఇద్దరి పారితోషికమే 50 కోట్ల వరకూ అయిందన్న మాట. ఇక సంగీత దర్శకుడిగా అనిరుథ్ కి 3 కోట్ల వరకూ ముట్టినట్టు సమాచారం.