చెన్నై లోను 'అజ్ఞాతవాసి' రికార్డు స్థాయి వసూళ్లు
- తెలుగు రాష్ట్రాల్లో 'అజ్ఞాతవాసి' సందడి
- ఓవర్సీస్ లో చూపుతోన్న హవా
- చెన్నై లోను రికార్డు స్థాయి వసూళ్లు
ఇక చెన్నై లోను ఈ సినిమా తన హవా చూపించినట్టుగా చెబుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే ఈ సినిమా 24 లక్షల గ్రాస్ ను సాధించినట్టుగా చెబుతున్నారు. ఇవి రికార్డు స్థాయి వసూళ్లని అంటున్నారు. సంక్రాంతి సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు .. చెన్నైలోను ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని టాక్. ఇక ఓవర్సీస్ లో త్రివిక్రమ్ .. పవన్ లకి గల క్రేజ్ ఈ సినిమాను వసూళ్ల పరంగా పరుగులు తీయిస్తుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.