తేజ సినిమా షూటింగులో భయపడిపోయాను: నవదీప్
Add ap7am to your home Screen

తేజ సినిమా షూటింగులో భయపడిపోయాను: నవదీప్

  • తేజ గారితో 'జై' సినిమా చేశాను 
  • 12 రోజులుగా నిద్రలేదు 
  • దాంతో డాన్స్ చేయలేకపోయాను 
  • అది ఆయన గ్రహించాడు
"తేజ గారి 'జై' సినిమా చేస్తున్నప్పుడు మీ వయసు కేవలం 17 సంవత్సరాలు. ఆ సినిమాకి సంబంధించి ఇది చేయలేకపోయాను అనిపించే సంఘటన ఏదైనా ఉందా?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో నవదీప్ కి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. "ఆ సినిమా కోసం 12 రాత్రులుగా షూటింగ్ చేస్తూ వస్తున్నాం. 12వ రోజు రాత్రి 'మనసా మనసా' అనే పాటకు డాన్స్ చేయవలసి వచ్చింది.

ఎంతగా ట్రై చేస్తున్నా తేజ గారు అనుకున్నట్టుగా రావడం లేదు. దాంతో నాకు డాన్స్ రావడం లేదా? అనే భయం నాలో మొదలైపోయింది. అప్పుడు తేజ గారు నన్ను పక్కకి పిలవడంతో, మరింతగా కంగారుపడిపోయాను. 'కొన్ని రోజులుగా నిద్ర లేకపోవడం వలన నువ్ అలసిపోయావ్ .. అందువలన రేపు షూటింగ్ ఆపేస్తున్నాను. రేపంతా రెస్ట్ తీసుకుని ఎల్లుండి రా .. చేద్దాం అన్నారు'. 'దాంతో నాలో భయం ఎగిరిపోయింది' అని చెప్పుకొచ్చాడు. . 
navadeep
teja

More Telugu News