ఆమె వల్లనే నేను ఎమ్మెల్యేనయ్యా!: సంపత్‌ కుమార్
Add ap7am to your home Screen

ఆమె వల్లనే నేను ఎమ్మెల్యేనయ్యా!: సంపత్‌ కుమార్

  • డీకే అరుణ నాకు మాతృ సమానురాలు
  • నాకు ఆమెతో ఎటువంటి విభేదాలూ లేవు
  • కొందరు ఈ విష‌యంపై కావాలనే పుకార్లు సృష్టిస్తున్నారు
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయ‌కురాలు డీకే అరుణ తనకు మాతృ సమానురాలని ఆ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. తాను అమె వల్లనే ఎమ్మెల్యేనయ్యానని తెలిపారు. త‌న‌కు ఆమెతో ఎటువంటి విభేదాలూ లేవని, కొందరు ఈ విష‌యంపై కావాలనే పుకార్లు పుట్టిస్తున్నార‌ని చెప్పారు. కాగా, తాను గ‌తంలో ఆర్డీఎస్‌ కోసం ఆమరణ దీక్ష చేసి జైలుకు కూడా వెళ్లాన‌ని, తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు మాత్రం ఆర్డీఎస్ కోసం తాము ఏమీ చేయ‌లేద‌ని అస‌త్య ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని ఇటీవ‌ల‌ త‌న నియోజకవర్గానికి వచ్చిన హరీశ్ రావును తాను గౌరవించానని అన్నారు.
sampath kumar
mla
Congress

More Telugu News