దేశంలో పుస్తక ప్రియులు ఎక్కువగా బెంగళూరులోనే ఉన్నారట... వెల్లడించిన అమెజాన్!
- వార్షిక రీడింగ్ ట్రెండ్స్‌ని విడుదల చేసిన అమెజాన్ ఇండియా
- ఎక్కువ మంది కొన్నవాటిలో పరీక్షాసన్నద్ధత పుస్తకాలు టాప్
- ప్రథమ స్థానంలో 'ఇండియన్ పాలిటీ (ఐదో సంచిక)'
ఇక ఎక్కువమంది కొన్న వాటిలో రెండో స్థానంలో ఫిక్షన్ రచనలు, మూడో స్థానంలో వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు నిలిచాయి. అమెజాన్ వెల్లడించిన వివిధ కేటగిరీ జాబితాల్లో 'సీతా- వారియర్ ఆఫ్ మిథిలా', 'వర్డ్ పవర్ మేడ్ ఈజీ', 'ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్', 'థింక్ అండ్ గ్రో రిచ్' పుస్తకాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అలాగే గతేడాది బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన చేతన్ భగత్ 'వన్ ఇండియన్ గర్ల్' పుస్తకం ఈ ఏడాది కూడా టాప్ 10 పుస్తకాల్లో నిలిచినట్లు అమెజాన్ ఇండియా నివేదిక పేర్కొంది.