raghuveera reddy: గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు క‌న‌క‌దుర్గమ్మ కిరీటం కాజేశారు.. ఇప్పుడు మ‌ళ్లీ అప‌చారం: ర‌ఘువీరారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
గ‌తంలో తొమ్మిదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు విజ‌య‌వాడ‌ దుర్గ‌గుడిలో క‌న‌క‌దుర్గమ్మ కిరీటం కొట్టేశార‌ని, ఆ స్థానంలో న‌కిలీ కిరీటం పెట్టార‌ని ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా అంత‌కంటే పెద్ద అప‌చారం చేశార‌ని విమ‌ర్శించారు. దుర్గ‌గుడిలో తాంత్రిక పూజ‌ల నిర్వ‌హణ ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండానే జ‌రిగిందా? అని ప్ర‌శ్నించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. దుర్గ‌గుడిలో తాంత్రిక పూజ‌ల విష‌యంలో టీడీపీ నియ‌మించే క‌మిటీల‌పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం లేద‌ని, హైకోర్టు జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. తాంత్రిక పూజ‌లు క‌చ్చితంగా జ‌రిగాయ‌ని, ఎవ‌రు? ఎందుకు? జ‌రిపించారో తెలియాల‌ని వ్యాఖ్యానించారు.    
Go Back to Shorts
raghuveera reddy
Andhra Pradesh
durgagudi
Vijayawada

More Telugu News