సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ఎస్కేప్ అవకూడదంటోన్న రకుల్!
  • సెన్సార్ పూర్తి చేసుకున్న 'జైసింహా'
  • హిందీ సినిమాలకు విజయ్ దేవరకొండ ఓకే 
  • విభిన్నమైన పాత్రలో నిత్యామీనన్    
*  సినిమా ఇండస్ట్రీలో తనకు ఇంతవరకు భయపడిపోయేంతటి సమస్యలు ఎదురుపడలేదని చెప్పింది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. "అన్ని చోట్లా ఉన్నట్టే ఇక్కడా సమస్యలుంటాయి. అయితే, మనం జాగ్రత్తగా వుంటే ఏ సమస్యా వుండదు. ఒకవేళ సమస్య ఎదురైనా ఎవరైనా సరే భయపడి ఎస్కేప్ అయిపోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. నేనైతే అదే చేస్తాను' అని చెప్పింది.      
*  నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'జైసింహా' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. ఈ నెల 12న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.    
*  'అర్జున్ రెడ్డి' సినిమాతో ఎంతో పాప్యులారిటీ తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ హిందీ సినిమాలలో కూడా నటిస్తానంటున్నాడు. మంచి స్క్రిప్ట్ వస్తే కనుక హిందీ సినిమా చేయడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పాడు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలో కూడా చేయడానికి విజయ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.  
*  గతంలో 'గంగ' సినిమాలో అంగ వైకల్యంతో బాధపడే యువతిగా నటించిన కథానాయిక నిత్యామీనన్ తాజాగా 'అ!' సినిమాలో మరో విభిన్నమైన పాత్రను పోషిస్తోంది. నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఈ చిత్రంలో లెస్బియన్ పాత్రలో నిత్యా నటిస్తున్నట్టు సమాచారం. 
Rakul
Balakrishna
vijay
nitya

More Telugu News