'అజ్ఞాతవాసి'లో పవన్ చేసింది డ్యూయెల్ రోల్?
- టీజర్ కి .. సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్
- పవన్ జోడీగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్
- అభిమానుల్లో పెరిగిపోతోన్న ఆసక్తి
ఈ రెండు పాత్రలు ఒకే జనరేషన్ కి సంబంధించినవి కావడం విశేషమని అంటున్నారు. ఒక పాత్ర జోడీగా కీర్తి సురేశ్ .. మరో పాత్ర సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కనిపిస్తారని చెబుతున్నారు. ఒకే జనరేషన్ కి సంబంధించి పవన్ రెండు పాత్రలను పోషించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు పాత్రలు ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తాయని కూడా చెప్పుకుంటున్నారు. జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.