varun tej: కష్టాలనుంచి బయటపడిన నాగబాబు .. బెంజ్ కారు కొనేసిన వరుణ్ తేజ్

షార్ట్స్‌లో చూడండి
ఆ మధ్య చరణ్ తో నాగబాబు 'ఆరెంజ్' అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ నష్టాన్ని మిగల్చడంతో నాగబాబు ఆర్ధికంగా చాలా ఇబ్బందులుపడ్డారు. ఆ సమయంలో తక్కువ రెంట్ వున్న ఇంట్లోకి మారిపోయామనీ .. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని కొన్ని సందర్భాల్లో నాగబాబు చెప్పారు కూడా.

చిరూ .. పవన్ అండదండలతో ధైర్యం తెచ్చుకున్న ఆయన, ఆ తరువాత టీవీ షోస్ తో బిజీ అయ్యారు. మరో వైపున నటిగా నిహారిక .. హీరోగా వరుణ్ తేజ్ తమదైన రూట్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు నష్టాల నుంచి బయటపడ్డారు. ఇటీవలే తండ్రికి ఒక ఖరీదైన కారును వరుణ్ తేజ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. తాజాగా తల్లిదండ్రులను హైదరాబాద్ లోని బెంజ్ షోరూమ్ కి తీసుకెళ్లి, 1 కోటి 30 లక్షల రూపాయల ఖరీదైన mercedes Benz GL 350 మోడల్ కారును ఆయన కొనుగోలు చేశాడట. ఎన్టీఆర్ .. అల్లు అర్జున్ ఇదే మోడల్ కారును వాడుతున్నారు.    
Go Back to Shorts
varun tej
nagababu

More Telugu News