sai dharam tej: 'ధర్మాభాయ్'ని కాదు .. 'ఇంటెలిజెంట్'నే ఫైనల్ చేశారట!

షార్ట్స్‌లో చూడండి
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించడంలో వినాయక్ సిద్ధహస్తుడు. భారీ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న తీరు ఆయన కెరియర్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. తాజాగా ఆయన సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టిన ఈ సినిమా, ముగింపు దశకి చేరుకుంది. తాజాగా మస్కట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకి 'ధర్మాభాయ్' .. 'ఇంటెలిజెంట్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'ధర్మాభాయ్'ను ఓకే చేశారనే టాక్ కూడా వచ్చింది. అయితే అందులో నిజం లేదట .. ఈ సినిమాకి 'ఇంటెలిజెంట్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.    
Go Back to Shorts
sai dharam tej

More Telugu News