విజయ్ జోడీగా మరోసారి ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్
- విజయ్ తో మురుగదాస్
- విజయ్ కి ఇది 62వ సినిమా
- సంగీత దర్శకుడిగా రెహ్మాన్
గతంలో విజయ్ సరసన కీర్తి సురేశ్ ..' భైరవ' అనే సినిమా చేసింది. విజయ్ తో కలిసి నటించే ఛాన్స్ ఒకసారి దక్కితేనే చాలనుకునే హీరోయిన్స్ వున్నారు. అలాంటిది కీర్తి సురేశ్ కి మరోసారి ఈ ఛాన్స్ దక్కడం విశేషంగానే చెప్పుకోవాలి. సన్ గ్రూప్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ, ఇతర కథానాయికలకు కీర్తి సురేశ్ గట్టిపోటీనే ఇస్తోందని చెప్పాలి.