Hyderabad: హైదరాబాద్ తాజ్‌మ‌హ‌ల్ హోట‌ల్ ఐదో అంత‌స్తు నుంచి దూకి.. యువ‌కుడి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

హైదరాబాద్‌ నారాయణగూడలోని తాజ్‌మ‌హ‌ల్ హోట‌ల్ వ‌ద్ద అల‌జ‌డి రేగింది. ఆ హోటల్ ఐదో అంత‌స్తు పై నుంచి ఓ యువకుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. అయితే, ఈ విష‌యాన్ని ఆ హోట‌ల్ యాజ‌మాన్యం బ‌య‌ట‌కు తెలియ‌నివ్వ‌లేదు. నిన్న సాయంత్రం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను గురించి పోలీసులు ఈ రోజు తెలుసుకున్నారు. ఆ హోటల్‌లో పనిచేస్తోన్న‌ లక్ష్మయ్య అనే 17 ఏళ్ల కుర్రాడు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడ‌ని తెలిపారు. అత‌డు ఉపాధి కోసం ఒడిశా నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చి ఈ హోట‌ల్‌లో ప‌నిచేస్తున్నాడ‌ని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.      
Hyderabad
taj hotel
suicide

More Telugu News