దినకరన్ కు జై కొట్టిన 18 మంది ఎమ్మెల్యేలు.. ప్రమాణ స్వీకారానికి హాజరు!
- ఆర్కే నగర్ నుంచి ఘన విజయం సాధించిన దినకరన్
- అట్టహాసంగా ప్రమాణ స్వీకారం
- హారతులిస్తూ స్వాగతం పలికిన మహిళలు
దినకరన్ నివాసం నుంచి సెక్రటేరియేట్ వరకూ ఘనస్వాగతం లభించింది. ఎంపీ శశికళా పుష్ప, తిరుచ్చి చారుబాల తొండమాన్ వంటి నేతలు ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు దినకరన్ కు హారతులు పట్టారు. తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వం మూడు నెలలు మాత్రమే ఉంటుందని దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని డీఎంకే ప్రకటించింది.