'అజ్ఞాతవాసి'లో యాక్షన్ సీన్లో వెంకీ ఎంట్రీ!
- 'అజ్ఞాతవాసి'లో వెంకటేశ్
- ఆయన పాత్ర పట్ల అందరిలో ఆసక్తి
- ఆయన సీన్ హైలైట్ అవుతుందంటూ ప్రచారం
ఈ నేపథ్యంలో పవన్ మేనమామగా ఓ కామెడీ సీన్ లో వెంకటేశ్ కనిపించనున్నారనే టాక్ నిన్నమొన్నటి వరకూ వినిపించింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం వెంకటేశ్ కనిపించేది కామెడీ సీన్లో కాదట .. ఓ యాక్షన్ సీన్లో అంటున్నారు. పవన్ తో పాటు .. వెంకటేశ్ కనిపించే ఈ ఫైట్ సీన్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ ఫైట్ సీన్ సీరియస్ గా .. పవర్ ఫుల్ గా ఉంటుందా? లేదంటే కామెడీ టచ్ తో ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.