తన పేరుతో అధికారిక మొబైల్ యాప్ విడుదల చేసిన పీవీ సింధు
- ట్విట్టర్ ద్వారా విడుదల
- ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో లభ్యం
- సింధుతో లైవ్ చాట్ చేసే అవకాశం
ఈ యాప్ ద్వారా అభిమానులు సింధు పోస్ట్ చేసిన వీడియోలు, ఆమె పోస్టులను చూడటంతో పాటు, ఆమెతో లైవ్ చాట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ యాప్‌లో సింధు తొలి వీడియోను పోస్ట్ చేశారు. తనకు అండగా ఉంటూ తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. smarturl.it/pvsindhu లింక్ ద్వారా యాప్‌ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని తన అభిమానులను ఆమె కోరారు.