సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'అస్సలు నమ్మలేరు' అంటున్న 'హలో' హీరోయిన్ 
  • రవితేజ సినిమాకి పక్కా మాస్ టైటిల్ 
  • హిందీలో మళ్లీ రీమేక్ అవుతున్న కమల్ సినిమా 
  • 'అజ్ఞాతవాసి' బెన్ఫిట్ షో ఖరారు  
*  'ఇప్పుడైతే ఇంత సన్నగా వున్నాను కానీ స్కూలు రోజుల్లో నేను చాలా లావుగా ఉండేదానిని' అంటోంది 'హలో' సినిమా ద్వారా పరిచయమైన ముద్దుగుమ్మ కల్యాణి ప్రియదర్శన్. "మీరు నమ్మరు, స్కూలు రోజుల్లో ఎనభై కిలోలు ఉండేదానిని. ఇప్పుడిలా సన్నబడడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకే చిన్నప్పుడు నన్ను చూసిన వాళ్లు ఇప్పుడు చూస్తే అస్సలు పోల్చుకోలేరు" అని చెప్పింది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజి దంపతుల కూతురే కల్యాణి.
*  ప్రస్తుతం 'టచ్ చేసి చూడు' చిత్రంలో నటిస్తున్న రవితేజ త్వరలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మించే ఈ చిత్రం షూటింగ్ జనవరి 5న లాంఛనంగా ప్రారంభమవుతుంది. కాగా, ఈ చిత్రం కోసం 'నేల టికెట్' అనే పక్కా మాస్ టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు సమాచారం.
*  గతంలో కమలహాసన్ హీరోగా బాలూ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన 'సతీ లీలావతి' అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించింది. దీంతో ఈ చిత్రాన్ని అప్పట్లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో 'బీవి నెం 1' పేరిట హిందీలో రీమేక్ చేశారు. అది కూడా అక్కడ హిట్టయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ డేవిడ్ ధావన్ ఈ చిత్రాన్ని తన తనయుడు వరుణ్ ధావన్ హీరోగా హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని జనవరి 10న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 9 అర్ధరాత్రి హైదరాబాదులో బెన్ఫిట్ షో వేయడానికి ప్లాన్ జరుగుతోంది. ఇందుకు సంబంధించి పోలీస్ శాఖ అనుమతి కూడా తీసుకున్నారట.      
kalyani
raviteja
Kamal Haasan
Pawan Kalyan

More Telugu News