'బాహుబలి 2' రికార్డును దాటలేకపోయిన 'టైగర్ జిందా హై'
- మొదటిరోజు కలెక్షన్లు రూ. 33.75 కోట్లు మాత్రమే
- రూ. 41 కోట్లు వసూలు చేసిన 'బాహుబలి 2' హిందీ వెర్షన్
- 5700ల థియేటర్లలో విడుదలైన 'టైగర్ జిందా హై'
బాహుబలి 2 హిందీ వెర్షన్ మొదటిరోజున రూ. 41 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది అతి ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన టాప్ 5 చిత్రాల జాబితాను బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆయన లెక్క ప్రకారం టాప్ 5లో సల్మాన్ చిత్రాలు రెండు ఉన్నాయి. 'బాహుబలి 2', 'టైగర్ జిందా హై' చిత్రాలు ప్రథమ, ద్వితీయ స్థానాలలో వుండగా, మూడో స్థానంలో 'గోల్మాల్ అగైన్' (రూ. 30.14 కోట్లు) ఉండగా నాలుగో స్థానంలో సల్మాన్ చిత్రం 'ట్యూబ్‌లైట్' (రూ. 21.15 కోట్లు) ఉంది. ఇక ఐదో స్థానంలో షారుక్‌ఖాన్ 'రాయిస్' (రూ. 20.42 కోట్లు) చిత్రం ఉంది.