devineni: పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమ

షార్ట్స్‌లో చూడండి
కుట్రతో పక్క రాష్ట్రాలను రెచ్చగొడుతున్నారని, పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుని అడ్డుకునేందుకు కాంగ్రెస్, వైసీపీ ప్రయత్నిస్తున్నాయని, అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును గాలికొదిలేసినవారు, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. ‘పోలవరం’పై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు, వైసీపీ నేత సుబ్బారెడ్డికి లేదని అన్నారు. ముందుగా చెప్పిన ప్రకారమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని దేవినేని ఉమ మరోమారు స్పష్టం చేశారు.
Go Back to Shorts
devineni
polavaram

More Telugu News