sai dharam tej: నా పాత్రను నేనే చేస్తుండటం కొత్తగా వుంది: సాయిధరమ్ తేజ్

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. దాంతో వెబ్ సిరీస్ లను రూపొందించడానికి యువ దర్శకులు ఆసక్తిని చూపుతుంటే, వెబ్ సిరీస్ లలో నటించడానికి యువ కథానాయకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా తాజాగా సాయిధరమ్ తేజ్ కూడా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. కల్యాణ్ శంకర్ తెరకెక్కిస్తూ .. నటిస్తోన్న ఆ వెబ్ సిరీస్ పేరే .. 'నేను మీ కల్యాణ్'. స్నేహం .. ప్రేమ .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు.

మంచి ఆదరణ పొందుతోన్న ఈ వెబ్ సిరీస్ లో సాయిధరమ్ తేజ్ తన పాత్రను తానే పోషిస్తూ ఉండటం విశేషం. ఈ వెబ్ సిరీస్ కి ఆయన ప్రత్యేక ఆకర్షణ అంటున్నారు. ఈ సందర్భంగా తేజు మాట్లాడుతూ .. వేరే పాత్రల్లో నటించడమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వెబ్ సిరీస్ లో నా పాత్రలో నేనే కనిపించనుండటం కొత్త అనుభూతిని ఇస్తోంది. నన్ను నన్నుగా తెరపై  చూసుకునే ఛాన్స్ రావడం నాకు సంతోషాన్ని ఇస్తోంది. మున్ముందు ఈ వెబ్ సిరీస్ కి మరింత ఆదరణ లభించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.    
Go Back to Shorts
sai dharam tej

More Telugu News