'జవాన్' సినిమా నిర్మాతను బెదిరించిన కేసులో ముగ్గురి అరెస్ట్
- డబ్బిస్తే పైరసీ కాకుండా ఆపుతామంటూ బెదిరింపు
- సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత
- నిందితుల అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
పైరసీ విషయంలో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని... కోరినంత డబ్బు ఇస్తే, ఇంటర్నెట్ లో ఈ సినిమా అప్ లోడ్ కాకుండా ఆపుతామని చెప్పారు. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో, వారు బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో, వీరిపై సీసీఎస్ పోలీసులకు నిర్మాత ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, నిందితులను హైదరాబాదులోని యూసఫ్ గూడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని రిమాండ్ కు తరలించారు.