తాగిన మత్తులో అంబులెన్స్‌ను తన 'ఆడి' కారు అనుకుని పట్టుకుపోయిన వ్యాపారవేత్త!
- స్నేహితుడిని ఆస్పత్రిలో చేర్పించడానికి వచ్చిన మిథిల్
- అంబులెన్స్ తీసుకుని ఇంటికి వెళ్లిన వైనం
- మరునాడు తిరిగి పంపించి, క్షమాపణలు
కానీ తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పార్కింగ్ స్థలంలో ఉన్న అంబులెన్సును తన కారు అనుకుని అందులో ఇంటికి వెళ్లిపోయాడు. అంబులెన్స్‌లో వచ్చిన అతన్ని చూసి కుటుంబ సభ్యులు కంగారు పడిన తర్వాత గానీ ఆ విషయాన్ని మిథిల్ గ్రహించలేకపోయాడు. మర్నాడు డ్రైవర్‌తో అంబులెన్స్‌ను తిరిగి ఆసుపత్రికి పంపించాడు.
ఈలోగా అంబులెన్స్ పోయిన విషయాన్ని గ్రహించిన ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అర్థరాత్రి కావడంతో పొరపాటున అంబులెన్సును తన కారు అనుకుని మిథిల్ తీసుకెళ్లాడని అతని డ్రైవర్ వారికి చెప్పాడు. ఇందుకు పరిహారం కూడా చెల్లించడానికి తన యజమాని సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అంబులెన్స్ దొరకడంతో ఆస్పత్రి వర్గాలు ఎలాంటి చర్యలు తీసుకోనప్పటికీ, జరిగిన సంఘటన గురించి వివరణ ఇవ్వాలని పోలీసులు మిథిల్‌కి సమన్లు జారీ చేశారు.