Subhra: వ్యభిచారం కేసులో పట్టుబడిన హీరోయిన్లు రిచా సక్సేనా, శుభ్రా చటర్జీ పంజాగుట్ట పీఎస్ కు తరలింపు!

  • స్టార్ హోటల్స్ పై పోలీసుల దాడి
  • దొరికిపోయిన ఇద్దరు హీరోయిన్స్
  • పంజాగుట్ట పోలీసులకు అప్పగించామన్న టాస్క్ ఫోర్స్
గత రాత్రి హైదరాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటల్స్ పై పోలీసులు దాడులు చేసిన వేళ, పట్టుబడిన బెంగాలీ నటిని శుభ్రా చటర్జీగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. శుభ్రా తాజ్ డెక్కన్ లో వ్యభిచారం చేస్తూ, పట్టుబడగా, అదే సమయంలో తాజ్ బంజారాలో టాలీవుడ్ హీరోయిన్ రిచా సక్సేనా దొరికిపోయిందని, వీరిద్దరినీ పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

శుభ్రాను హోటల్ కు తెచ్చిన వెంకట్రావ్ ను, రిచాను బంజారాకు తీసుకెళ్లిన బ్రోకర్ ను కూడా అరెస్ట్ చేశామని, వీరిని రేపు కోర్టులో ప్రవేశపెడతామని పోలీసు అధికారులు తెలిపారు. వీరిద్దరూ ఒక రాత్రి గడిపేందుకు లక్ష రూపాయలకు బేరం కుదుర్చుకుని వచ్చారని, ఇద్దరినీ విటులకు పరిచయం చేసిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ మాధ్యమంగా ప్రకటనలు ఇచ్చి, వీరిని హోటల్స్ కు తీసుకు వచ్చారని, కేసును విచారిస్తున్నామని అన్నారు.
Subhra
Richa saksena
Taj Banjara
Taj Deccan
Prostitution
Online booking

More Telugu News