vanitha reddy: అందుకే, మేము మా కోడ‌లు వ‌నితారెడ్డిపై పోరాడుతున్నాం: నటుడు విజ‌య్ తండ్రి వాద‌న‌

షార్ట్స్‌లో చూడండి
హాస్య‌న‌టుడు విజ‌య్‌సాయి ఆత్మ‌హ‌త్య చేసుకున్న కేసులో పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతోన్న వేళ ఆయ‌న భార్య వ‌నితారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి రెండు ఫొటోల‌ను పంపిన విష‌యం తెలిసిందే. వ‌నితారెడ్డి పంపిన ఫొటోల‌పై విజ‌య్ తండ్రి స్పందించారు. ఆ ఫొటోల‌లో త‌న కుమారుడితో ఉన్న‌ ఆ అమ్మాయి ఎవ‌రో బ‌య‌ట‌కు రావాలని ఆయ‌న అన్నారు. వ‌నిత ఈ ఫొటోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తోందని తెలిపారు. ఇవే ఫొటోల‌ను కోర్టులోనూ ఇచ్చిందని అన్నారు. వ‌నితారెడ్డి చేసే ఆరోప‌ణ‌ల్లో నిజం లేదని, కోర్టులో ఇచ్చిన ఫొటోల‌నే మ‌ళ్లీ ఈ రోజు పంపిందని చెప్పారు. మీడియాను డైవ‌ర్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోందని తెలిపారు.

ఆమె నాట‌కాలు ఆడుతోందని, అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తోందని అన్నారు. ఆమె బ‌తుకంతా ఇలా బ్లాక్ మెయిల్ చేయ‌డ‌మేన‌ని అన్నారు. త‌న‌ భార్య‌పై కూడా ఆరోప‌ణ‌లు చేస్తోందని, త‌న‌ భార్య అమాయ‌కురాలని తెలిపారు. త‌న మ‌న‌వ‌రాలిని చాలా అపురూపంగా పెంచుకుంటామ‌ని, అది త‌న కుమారుడి చివ‌రి కోరిక అని అన్నారు. అందుకే తాము త‌న కోడ‌లు వ‌నితారెడ్డిపై పోరాడుతున్నామ‌ని చెప్పారు. త‌న మ‌న‌వ‌రాలిని తామే పెంచుకుంటామ‌ని తెలిపారు.  
Go Back to Shorts
vanitha reddy
vijay sai
suicide

More Telugu News