subhalekha sudhakar: అమితాబ్ అంటే ఇష్టం .. ఆయనే స్వయంగా వచ్చి పిలిచారు!: శుభలేఖ సుధాకర్

షార్ట్స్‌లో చూడండి
తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడిన 'శుభలేఖ' సుధాకర్ .. తన జీవితంలో ఓ మరిచిపోలేని సంఘటన వుందంటూ చెప్పుకొచ్చారు. "కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు అప్పటికే అమితా బచ్చన్ తో కలిసి పనిచేశారు. అమితాబ్ అంటే నా కెంతో ఇష్టమని ఆయనకి తెలుసు. దాంతో ఓసారి చెన్నయ్ లో అమితాబ్ బస చేసిన హోటల్ కి నన్ను తీసుకెళ్లారు. తీరా హోటల్ రూమ్ వరకూ వెళ్లాక బ్రేక్ పడింది. అమితాబ్ గారు పిలిచింది గోపాల్ రెడ్డి గారిని, ఆయనతో కలసి నేను లోపలికి వెళ్లడం పద్ధతి కాదు అనిపించి బయటే ఆగిపోయాను'

గోపాల్ రెడ్డిగారితో 'సార్ .. మీరు లోపలికి వెళ్లండి .. చెప్పండి .. ఓ అయిదు నిమిషాలు ఇక్కడే వెయిట్ చేస్తాను .. ఈ లోగా మీరు వచ్చి పిలిస్తే వస్తాను .. లేదంటే మీరు ఏమీ అనుకోకండి .. వెళ్లిపోతాను' అన్నాను. గోపాల్ రెడ్డి గారు నచ్చజెప్పినా నేను వినిపించుకోలేదు. ఆయన లోపలికి వెళ్లడంతో నేను బయట పచార్లు చేస్తున్నాను .. అంతలో డోర్ ఓపెన్ అయింది .. ఎదురుగా అమితాబ్ గారు నిలబడి వున్నారు.

"సుధాకర్ .. మీరు గోపాల్ రెడ్డికి ఫ్రెండ్ అయితే నాకూ ఫ్రెండే .. ప్లీజ్ కమీన్" అన్నారు. అంతటి సూపర్ స్టార్ అలా స్వయంగా వచ్చి పిలవడం నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది .. ఆనందాన్ని కలిగించింది. ఈ సంఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ చెప్పుకొచ్చారు.      
Go Back to Shorts
subhalekha sudhakar

More Telugu News