subhalekha sudhakar: చెన్నై వెళ్లిన కొత్తలో హోటల్లో పనిచేశాను: శుభలేఖ సుధాకర్

షార్ట్స్‌లో చూడండి
'శుభలేఖ' సుధాకర్ పేరు వినగానే సన్నగా .. పొడుగ్గా వున్న ఓ రూపం మనకు గుర్తొస్తుంది. తెరపై హాస్యంతో ఆయన చేసిన సందడి కళ్ల ముందు కదలాడుతుంది. 'శుభలేఖ' సినిమా చేసిన తరువాత అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

" నేను విశాఖలో బీకామ్ చేశాను .. ఆ తరువాత చెన్నై వెళ్లి అక్కడి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. అప్పటి వరకూ నాన్న డబ్బులు పంపిస్తూ వచ్చారు. ఇక నా కాళ్లపై నేను నిలబడాలి అనుకుంటూ ఉండగా .. ఓ హోటల్లో క్యాషియర్ కావాలంటూ యాడ్ వచ్చింది. నేను అప్లై చేయడం .. నాకు ఆ ఉద్యోగం రావడం జరిగిపోయాయి. చెన్నైలో ఉండటానికి ఒక ఉద్యోగం దొరికింది .. నన్ను నేను పోషించుకోవడానికి ఒక ఆధారం దొరికింది .. సినిమాల్లో ప్రయత్నాలు చేయడానికి అవకాశం లభించింది" అంటూ చెప్పుకొచ్చారు.         
Go Back to Shorts
subhalekha sudhakar

More Telugu News