కాసేప‌ట్లో హాస్య‌న‌టుడు విజ‌య్ అంత్య‌క్రియ‌లు
Add ap7am to your home Screen

కాసేప‌ట్లో హాస్య‌న‌టుడు విజ‌య్ అంత్య‌క్రియ‌లు

  • కుటుంబ క‌ల‌హాల‌తో విజ‌య్ ఆత్మ‌హ‌త్య‌
  • పోస్టుమార్టం పూర్తి
  • తరలి వచ్చిన సినీ ప్ర‌ముఖులు, బంధువులు
కుటుంబ క‌ల‌హాల‌తో సినీన‌టుడు విజ‌య్ హైద‌రాబాద్ యూస‌ఫ్‌గూడ్‌లోని తన‌ ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. మ‌రి కాసేప‌ట్లో ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. విజయ్ మృతదేహానికి ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. ఉస్మానియా నుంచి యూసఫ్‌గూడలోని ఆయన ఇంటికి తీసుకువచ్చిన కొద్ది సేప‌టికి.. ఆయ‌న‌ మృతదేహాన్ని అక్క‌డి నుంచి ఎర్రగడ్డ శ్మశాన వాటికకు తరలించారు. అంత‌కు ముందు చివ‌రిసారి విజ‌య్‌ను చూడ‌డానికి ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు సినీ ప్ర‌ముఖులు, బంధువులు భారీగా వ‌చ్చారు.
vijay
died
Hyderabad

More Telugu News