మరో ట్విస్ట్... విజయ్ సాయి భార్య వనితకు ఇద్దరు తండ్రులు, సహజీవనం చేస్తున్న తల్లి... పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు!
- స్కూల్ లో ఓ పేరు, పాస్ పోర్టులో మరోపేరు
- తండ్రి పేర్లు కూడా మార్చి చూపిన వనిత
- రఫీ అనే వ్యక్తితో వనిత తల్లి సహజీవనం
- కేసును లోతుగా దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
ఇక ఆమె తల్లి రఫీ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోందని కూడా గుర్తించిన పోలీసులు, విజయ్ కి, రఫీకి మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు సాగిస్తున్నారు. తన సూసైడ్ వీడియోలో విజయ్ ఆరోపించిన లాయర్ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. ఇన్ని పేర్లు, ముఖ్యంగా తండ్రి పేరు మారిన కారణాలను గురించి ప్రస్తుతం వనితను ప్రశ్నిస్తున్న పోలీసులు, ఆమె నుంచి మరిన్ని వివరాలు వస్తే, వారి కుటుంబ నేపథ్యం గురించి ఓ అవగాహన వస్తుందని, అది కేసుకు ముఖ్యమని పోలీసు వర్గాలు అంటున్నాయి.