పవన్ బ్యానర్ లో నితిన్ చేస్తోన్న సినిమాకి టైటిల్ ఖరారు
- కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్
- అమెరికాలో ఫస్టు షెడ్యూల్ పూర్తి
- టైటిల్ గా 'గుర్తుందా శీతాకాలం'
- కథానాయికగా మేఘా ఆకాశ్
త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమాలో నితిన్ జోడీగా మేఘా ఆకాశ్ నటిస్తోంది. ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావడంతో, ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. తమన్ అందించిన సంగీతం ఈ లవ్ స్టోరీకి ప్రధానమైన బలంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే .. దిల్ రాజు నిర్మాణంలో .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ 'శ్రీనివాస కల్యాణం' చేయనున్న సంగతి తెలిసిందే.